Wednesday, June 12, 2024

విజయదశమి తేది 24-10-23 శీర్షిక : ప్రజా ఆనందమే / పాలకులకు కనువిప్పు.

 విజయదశమి 

తేది 24-10-23
శీర్షిక : ప్రజా ఆనందమే / పాలకులకు కనువిప్పు. 

పండగైనా పబ్బమైనా 
తిన్నామా తాగామా అనకుండా 
లోతుగా ఆలోచించగలిగితే 
నీతులన్నీ అవగతమే కదా ...

 దుష్ట శిక్షణలకు శిష్ట రక్షణలకు 
 అండదండలైన అసలు సిసలు పాలనలు...
 తోడు నీడై నిలిచే పాలకులు చిరునామాలు
 ప్రజలే పరమార్థంగా సాగే పాలనలు... 

యుగాల కాలం గడిచినా 
 ప్రజలు మరువరనే సంకేతాలు 
 అయినా పట్టని నేటి పాలకులు 
 స్వార్థ కుబుసాలను వదలరు ...

సత్య సంధతల హరిశ్చంద్రుడైనా 
 సర్వ నిష్ఠల శ్రీరామచంద్రుడైనా 
 సకల విధాల ధర్మం తప్పని చక్రి 
 అండ దండల పాండవులైనా ...

అదేకదా జీవిత పరమార్థం 
బాధపడినా.. బోధపడని కాముకులకు 
కావాలొక కనువిప్పు విజయదశమిగా 
అడుగడుగున నేటి పాలకులకు ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment