కవన రవళి… నానీలు
తేది: 31-10-2023
1. ఐదు రోజులు
కూలికెల్లావో..
ఇక ఐదేండ్లు
బానిసవే!
2. సుక్కముక్కకు
నువు ఆశపడితే
బొక్కబోర్ల
పడతావు!
3.నాయక చరితలు
గుర్తెరుగు..
జీవిత నౌకను
సరిదిద్దుకో!
4. ప్రిపోలింగు
షూట్లకు పాట్లతో
ఫీట్లెన్నో చేసారంటేనే…
రంగు మారుద్ది!
5. ఎన్నికల కాలం
నేత(న్న) కు బలం
కండువాల
బేరంతో!
6. వినాయకుడికి
పర్మిషన్ !
నాయకుడికేమో
కమీషన్!
7. యుగాలైనా
జగాన తేజం..
రాముని పాలన
ఘన ఉదహారణం!
8. తిప్పలని తెలిసి
తప్పలేదు తాను..
తిప్పని మాటకు
విలువ..
రామరాజ్యం!
9. కాదెందుకో
రామరాజ్యం
దృష్టాంతం
కలియుగాన
ప్రజలకు…నాయకులకు!
10. రామున్ని మొక్కిన
ప్రజలు పాలకులు
చిక్కుతారు
కలిమాయలకు!
నగునూరి రాజన్న
No comments:
Post a Comment