కవన రవళి- హైకూలు.
02-11-23
1.
బడి మైదానం
అలిగి పోయినది
బడా బాబుకు…
2. అక్షరాలకై..
ఆరాట పోరాటం
ఏసి గదుల్లో
3. ఎదురుచూపు
లక్ష్మీదేవి కృపకై
చదువులమ్మ
4. మహా ప్రియము
అంగట్లో సరుకులై
ఆంగ్ల విద్యలు…
5. అందని ద్రాక్ష
జనసామాన్యులకు
విద్య వైద్యము..
6. మైకుల హోరు
ఫ్లెక్సీల జోరులతో
జనం బేజారు.
7. రాజపూజ్యము
మణులు మాణిక్యాలు
మేనిఫెస్టోలో…
8. కోటకు సూటి
పక్షులకు నూకలు
పథకాలతో…
9. కారిపోయెనా
రక్తపు కన్నీరుగా
రైతు ఆశలు…
10. కట్టలు పోయి
కారిపోయిన నీరు
దక్కె కట్టలు
నగునూరి రాజన్న
No comments:
Post a Comment