Wednesday, June 12, 2024

శిక్షణ . తేది : 01-11-2023 నైపుణ్యం

 శిక్షణ .

తేది : 01-11-2023 
నైపుణ్యం 

 అవసరార్థం అంతర్భాగమే 
 నిబిడీకృతమైన నైపుణ్యం.. 
 ప్రకృతిసిద్ధమైన ప్రశిక్షణలు 
 విశ్వములోని వివిధాలకు ... 

 అవనిమాత అంతుచిక్కని 
 భ్రమణ పరిభ్రమణములు 
 ఆ ఖగోళములోని కక్ష్యలలో 
 కదలాడే గ్రహకూటములు ... 

పశు పక్ష్యాదులకు పుట్టుకతోనే 
పట్టు కలిగి పయనంలో పంక్తులు ... 
ఆకారం అమురుకుని అధిగమించు 
గాలికెదురీదుతూ గమ్యం చేరు ...

మారిన జీవనాన కనుమరుగైన 
 అసలు లక్షణాలతో మనిషికవసరమే 
 మాటిమాటికి ఈ శిక్షణల మతాబులు
 పూటపూటకు ప్రశిక్షణల మెరుగులు ...

No comments:

Post a Comment