ఆనంద క్షణాలు
తేది- 30-10-2023
శీర్షిక- కలబోతలు
తెరచాటున దాగిపోయిన
మొరటు పనుల ఆనందాలు…
అప్పుడప్పుడు అలారంలా
గొప్ప గొప్ప అనుభూతులు ...
కాలం పొరలలో కమ్ముకు
పోయిన..
కమ్మని చిలిపి తలపుల జాడలు…
తప్పని మార్పుల తీర్పులు చెబుతుంటే..
సన్న జాజుల
సౌరభమే దరహాసముపై...
మంద్రపు నీలములలో
సంద్రపు అలల ఛాయలా
పండు వెన్నెల పాన్పులపై
ఆట కోయిలలమై ఆడినప్పుడు ...
మధురమైన సీతాఫలాల
వేటకై గుట్టంతా గాలించగ
తోటమాలి కోప తాపాలకు
గూబలు గుయ్ మన్న గుంభనాలు...
బుద్ధిమంతుల సద్దిముల్లెలా
సుద్దులన్నీ సుబ్బరంగా విని
మరువలేని మర్కటపు ఛాయలు
వదలని
కోతి కొమ్మచ్చి ఆటల దూకుళ్లు ...
ఒకటా… రెండా.. మదినిండా…
బాధ్యతల బందీలమై పేజీలు
దొర్లిపోయి…నిక్షిప్తమైన నిగూడపు
నీడలు…వంపుకుంటే కమ్మని మధురిమలు…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment