ఆవలి గట్టు
తేది: 01-11-2023
శీర్షిక : అలవోకగా…
ఓటములు తాత్కాలికమే
గెలుపున్నది ముందరలా…
నిశి చీకట్లు తొలిగిపోవా
వెలుగురేఖల రాకలతో…
అందని ద్రాక్షలు పుల్లనైనా
అందుకుంటే ఆ కిక్కే వేరు …
మరువలేని అతి మధురమై
మననంలో మంచి గంధమే…
అలసత్వాలను ఆవలకునెట్టి
జవసత్వాలను నింపుకుంటే…
నైపుణ్యాలకు సానబెట్టి
నవగమనాలకు పట్టం కడితే…
కలలు కనే ధైర్యం చేసి
కష్టించే దమ్ము నింపుకుంటే…
కాదేది అందని దూరం
ఇష్టపడితే ఇగురమై చేరమా
ఆవలిగట్టు అలవోకగా….
No comments:
Post a Comment