Wednesday, June 12, 2024

చిత్ర కవిత 29-20-23 బొమ్మల కొలువు

 చిత్ర కవిత

29-20-23
 బొమ్మల కొలువు 

 మాటలోనే మంత్రమున్నది 
 బొమ్మలు నిలిపి పూజించడం 
 ఆచార సంప్రదాయమై అరయ 
 వెలుగులీనే అపరంజి బొమ్మలతో …. 

ఆది దంపతులైన పార్వతి పరమేశ్వరులు 
ఆత్మ బలం మిన్నంటు అమ్మ దుర్గమ్మ 
అప్పుతీరని వడ్డీకాసులవాడు వెంకన్న 
ఆదిశేషుడే ఆసనమైన ఆ విష్ణుమూర్తి ....  

మయూరి పించం పరమపావనం 
 కృష్ణంవందే జగద్గురుం 
 ఆదిపూజ్యుడు గణాధిపతి 
 అమ్మలగన్న అమ్మలు లక్ష్మీసరస్వతులు 
 సంతోషాలు నిండిన పెళ్లి జంట 
 అపురూపమైన ఆవులేగలు 
 అన్నీ కలిపిన జీవన విశేషాలు ...

దసరాకు వస్తిమి మిసమిసమంటూ 
పెట్టెల్లోనివన్నీ బుట్టబొమ్మలై మురిపంగా
కుందనాలు కుమ్మరిస్తూ వందనాలు స్వీకరిస్తూ 
 వచ్చేవారికి పోయేవారికి వాయనమంటాయి ... 

 ముచ్చటగా పిల్లలకొరకు కొలువైనా 
 ముత్తైదువులు మురిపమై వాయనం 
ఇచ్చిపుచ్చుకుంటేనే శోభాయమానమై 
 అందం సుందరం ఆనందం ...

నిగనిగల మెరిసిపోతూ 
నవరాత్రులంతా సేదదీరు... 
నిండైన అందాల బొమ్మలు 
నాగరికత నడకల ముద్రలలో ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment