Sunday, June 2, 2024

లలిత గీతం తేది : 30-09-23 శీర్షిక : నల్లనయ్య

 లలిత గీతం 

తేది : 30-09-23 
శీర్షిక : నల్లనయ్య 

నల్లనయ్య శ్యామా 
ఏదీ నీ పిల్లనగ్రోవి… 
నిను చేరి కొలిచెదాము 
మము బ్రోచి పాలించుమా… 

రవములు మోగగనే 
రాధమ్మ మదిన నీవూ…. 
వెదురుతో నాదమైనా 
వేవేల రాగాలు మదిలోన…
 // నల్లనయ్యా// 

వేణువును ఊదగనే శ్యామా 
మా తనువున పరవశాలే… 
యదునందనా దేవా 
మము దయచూడగ రావా..
 // నల్లనయ్యా// 

అపురూపమే ఆ గానం 
అనన్యమే ఆ మధురం… 
ఆలమందలు సైతం 
ఆనందాన శ్రోతలాయె… 
 //నల్లనయ్యా//. 

ఎంతటి మహాత్యమో 
మురళి నాదములో…. 
గోపెమ్మల మనసు దోచి 
నీ ప్రేమను పంచావు…
 // నల్లనయ్యా //

 నగునూరి రాజన్న 

No comments:

Post a Comment