Sunday, June 2, 2024

చిత్ర కవిత తేది 02-10-2023 శీర్షిక : మంచి చెడుల మాలోకం…

 చిత్ర కవిత 

తేది 02-10-2023
శీర్షిక : మంచి చెడుల మాలోకం… 

బండ్ల బుడుగు బాటల కష్టాలను బాపి 
 బండసొంటి డాంబరుతో రాజమార్గపు 
రహదారులేసి రాకపోకల సౌకర్యం జేసి 
పిల్లపెద్దల అక్కెర్లన్నీ ఒడ్డెక్కించింది... 

పాలధారలను పట్నంవైపు పారించి 
 కూరమళ్లను ముల్లెకట్టించుకుని 
 రైతు  రొక్కాన్ని చూసే మధ్యవర్తియై 
 మిద్దెబతుకులకు ఊతమైంది ...

ఊరికి కొత్త వార్తలు మోసుకొచ్చి 
 విజ్ఞానాలలో ఓనమాలు దిద్దించి 
 పల్లె ప్రగతిలో మేటిగా నిలిపి 
 విశ్వనీరాజనాలను వెలిగించింది ....

 పల్లెకు పట్నానికి రహదారేసి
 అక్షరజ్ఞానాలకు వారధియై 
పిల్లల పెరిగిన అక్కెరపూర్తులను 
 ఇంటిపెద్దయి ఒంటిచేత్తో తీర్చింది ..

కాని అప్పుడప్పుడనిపిస్తుంది… 
పచ్చని పల్లెను పట్నమెత్తుక పోయి 
 పడమటి వాసనల రుచులను చూపి 
 పచ్చని పల్లెలో చిచ్చు రేపిందా అని ... 

No comments:

Post a Comment