Sunday, June 2, 2024

మాటలన్నీ పైపైనే తేది 29-09-2023 శీర్షిక : మర్మం…

 మాటలన్నీ పైపైనే 

తేది 29-09-2023
శీర్షిక : మర్మం… 

పల్లెపట్టున వెల్లివిరిసిన అనురాగాల 
పూదోటలు..అమాంతంగా పట్నపు బాట 
పట్టగానే బజారులోనే కబుర్లతో కడుపులు 
నింపి పంపేస్తున్నాయి ఇప్పుడు...

మేడిపండులాంటి మెహర్బానీ ముచ్చట్లతో 
కాలేకడుపుకు కంకెడు మెతుకులు విదిల్చరు 
కానీ స్వకార్యం చంకలో బెట్టుకుని చక్కబెట్టుకోగల 
ధీమాల బాజాలతో …బుట్టలో వేసుకోగలరు... 

 పానకం లాంటి తీయని మాటలతో 
 పానమెదురుబెట్టుడే కానీ పైసా 
 విదిలించక పరేశాను జేసుడే ... 
 పాలకుల హామీల ముచ్చట్లలా…

సంఘటితమైతే ఎన్నో సాధించినా .. 
పొలములో కలుపుమొక్కలా…
పోడుభూమిలో కూడా ఆవుసు బోసుకుంటూ ... 
వెంట వెంట నడుస్తూ కాటుకు మాటేస్తున్నది.

మనిషిని మనిషిగా చూసే మర్మమేదో 
మాయమౌతున్నది.. మహాభూతమేదో 
మన మధ్య తచ్చాడుతూనే మారణ 
హోమాలకు ఆజ్యం పోస్తున్నది... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment