వాల్మీకి
తేది- 28-10-23
శీర్షిక : తపఃసంపన్నుడు
అగ్నిశర్మగా ఆనతిచ్చినా
బోయవానిగా పిలుచుకున్నా
రత్నాకరునిగా వినుతికెక్కినా
వల్మీకమున జ్ఞానమొందెను…
బ్రహ్మ స్వరూపమై బహు గొప్పగ
రాణించి రచియించె రామాయణం...
సంస్కృతమున ప్రథమ శ్లోకంతో
ఆదికవిగా తాను వినుతికెక్కే ...
రామునికి సమకాలీకుడై
రమ్యముగా రచియించె
ఇరువది నాలుగు వేల
శ్లోకములతో ఇల రామాయణం…
రాముణ్ణి దేవుడిగా
దర్షింపజేసిన
రమణీయ మహర్షి…యుగములెన్నయినా
జగమున తేజోమయమై…నాటికి
నేటికి రామరాజ్యమే ఘన ఉదహరణమై
నిలిపిన ప్రజ్ఞాశాలి…
సీతమ్మను చింతలాదరించినవేళ
స్వంత కూతురిలా సమ్మానించి
సముచిత సపర్యలను ఏర్పాటు
సద్భావనాలు బోధించిన తపఃసంపన్నుడు. ....
ఇనవంశోద్దారకులైన లవకుశులకు
సత్ప్రవర్తనల విద్యాబుద్ధులు
నేర్పించి..
రామాయణ వ్యాప్తి
గావించి విశ్వజనులకు
వీనుల
విందుగా బోధింపజేసిన మహాత్ముడు.
నగునూరి రాజన్న
No comments:
Post a Comment