Sunday, June 2, 2024

హుషారుగీతం తేది : 27-09-2923. శీర్షిక : విరించి కానుక…

 హుషారుగీతం 

 తేది : 27-09-2923.
 శీర్షిక : విరించి కానుక…
 సహస్రాధికం. 

 కవుల చేతులలో కదలాడిన 
భాషామతల్లి అచ్చతెలుగు నుడికారపు 
కొలనులో తలారా స్నానమాడి పట్టుబట్టల్లో 
పొదిగిన బుట్టబొమ్మలా ఎన్ని హొయలు పోయి 
ఎంత హుషారెక్కించిందో ?

 మాత్రలతో మాంత్రికతలల్లి 
 పదాల పరిమళ జల్లులు కురిపించగనే… 
తన్మయాల ముద్దై తపనలతో 
 తనివిదీర కోయిలలై పాడుకుంది…. 

 ప్రకృతి కోనలో పాదయాత్రలా 
 పవనవీచికల పరవశాలకు 
 గరిక వనం తలలూపిన చందంగా.. 
మైమరిచి తన్మయత్వమైన గోపాలుని ఆలమందలే… 

 గుండె గూటిలో తచ్చాడుతూ 
మనోతంత్రులను మీటుతూ 
 హాయి పవనాలను వీచుతూ 
 జలపాతాలను దూకించింది… 

 కొన్నిసార్లు… ఉద్దెర పొద్దులు లేని ఉప్పెనలా 
 జనసంద్రాన్ని ఉర్రూతలూగించింది… 
నిద్దుర పోనివ్వని రవిచంద్రుల్లా 
ఉద్యమమై దూసుకుని పోయింది… 

 ఏది ఏమైనా మన మాతృభాషలో 
 వెల్లువలై పారింది.. ఎనలేని ఆనందాలను 
 ఎల్లలెరుగని విశ్వ జనావళికి విరించి వింత
కానుకగా వినోదాలను పంచింది ... 

 నగునూరి రాజన్న 

No comments:

Post a Comment