గద్ద
27-10-2023
శీర్షిక : కఠోర పరిశ్రమలకు తార్కాణం
అరువదెనమిది రకాల ఆరిందలు
విష్ణుమూర్తికి విహంగ వాహనమై
ఆధ్యాత్మికతతో అలరించిన గరుత్మంతుడు
అవినాభావమే హైందవమున ….
ఒంటరిగానే మింటిన ఎక్కుపెట్టిన
బాణమై
మేఘాలపైనుండే మేను
కదిలించినా…
నేలపై నడయాడే ఆహారాన్ని సారించి
అలవోకగా దూసుకొచ్చి అందుకోగల నేర్పరి...
కొంతమంది డాంబికాల పెంపకాలకు
పెన్నిధైయినా…వార్తలకు వారధిగా నిలిచినా…
మొత్తం మీద
చిత్తమొచ్చిన చిద్విలాసపు
స్వేచ్చ విలువల పక్షిరాజే ...నీటి నుండి
చేపలనైనా మైదానంలో కోడిపిల్లయినా
అడవిలోన చిన్నపాటి జింకలనైనా ఎగరేసుకుపోగా …
పంట పొలాల్లో పారిపోతున్న పాములనైనా పట్టి తినగా….
డెబ్బదేండ్ల జీవిత గాథలో పెద్ద దెబ్బనే
నలుబదుల్లో ముక్కునరగదీసుకోవడం…
పిక్కటిల్లే బాధనే పెరిగిన రెక్కల ఈకలు
పీక్కుని జీవితం పాకాన పండించుకొనుటలో…..
కరుణలేని కఠోర పరిశ్రమకు తార్కాణమై
జీవిత విలువలను బోధిస్తుంది….
కాలిగోళ్ళను కూడా కరగదీసుకుని
కవాతుకు సిద్దపడు ఐదు నెలల కాలముల
లంఖణములతో కాలమెల్లదీసి…అందమైన
సుందర రూపం సంతరించుకోవడానికి….
No comments:
Post a Comment