Wednesday, June 12, 2024

నీవొస్తావని… తేది: 28-09-23 శీర్షిక : చేవ్రాలుగా…

 నీవొస్తావని… 

తేది: 28-09-23
శీర్షిక : చేవ్రాలుగా…

మననమెంత మధురమో 
 ఎదురుచూపుల రమణీయం 
 ప్రతిక్షణం పలవరింతలే 
 ఆనంద డోలికల అనుభూతి వరం ... 

 ఉదయతపూర్వపు ఉలికిపాటు 
 స్వప్నలోకపు పలకరింపులు 
 మత్తుగా ఒత్తిగిలినా నీ యాదులే 
 గగనకుసుమమే కాలం కదలికలు ... 

కోయిలల మగత కూతలు 
తనువాయే మయూర కదలికలు 
ఆలోచనలన్నీ పిచ్చుకల కోలాహలం 
 ప్రతీది గుడిగంటలే నా మదిలో ...

అప్పుడే ఆరాటం నీమీద 
అంతలోనే తీరని పోరాటం 
మరుక్షణం గడవడమెలా 
ఎన్నాళ్లని ఈ ఎదురుచూపులు ...

తెరదించు సఖీ నా ఎదురుచూపుల 
వాకిళ్లకు ... కరమందించి నేనున్నానని 
చేసుకున్న బాసలకు చేవ్రాలుగా ....
కథ సుఖాంతమయ్యే కాలంగా…. 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment