బతుకమ్మ పాటలు
తేది: 21-10-23
శీర్షిక : సప్తవర్ణ శోభితమే
సప్తవర్ణ శోభితమే బతుకమ్మా
సంబరాలు మోసుకొచ్చే బతుకమ్మా
నవరాత్రి సందళ్ళు బతుకమ్మా
సంబరాలు మోసుకొచ్చే బతుకమ్మా
పచ్చ పచ్చన్ని పూలతో బతుకమ్మా
ఎర్ర ఎర్రన్ని పూలతో బతుకమ్మా
పసుపు కుంకుమల శోభలే బతుకమ్మా
పడుచులంతా గూడి బతుకమ్మా
పబ్బతిపట్టి ఆడేరు బతుకమ్మా
సిరుల పూలన్నియు బతుకమ్మ
శ్రీచక్ర రాసులుగా బతుకమ్మా
వనితలంతా చేరి బతుకమ్మా
వలయాలుగా చేరి బతుకమ్మా
వయ్యారంగా ఆడిపాడేరు బతుకమ్మా
ఆదరంగా అందుకోవమ్మా బతుకమ్మా
ఆడపడుచు పూజలు బతుకమ్మా
సాదరంగా పూజించి బతుకమ్మా
సాగరమున వదిలేరు బతుకమ్మా
సాగనంపేరు తృప్తిగా బతుకమ్మా
నగునూరి రాజన్న.
No comments:
Post a Comment