గెలుపు పిలుపు
తేది: 28-09-23
శీర్షిక :ఒళ్ళంతా తుళ్ళింతలే…
అమ్మ మాటే ఓంకార మంత్రమై
అడుగడుగున స్ఫూర్తినిచ్చింది ...
పల్లె పరిసరాల పరిస్థితులే
పట్టుదలలు నింపి తట్టి నిలిపింది...
భళ్ళుమని తెల్లారడానికి
బాకీపడిన
నిషిజాడలలో శుకపికముల కువకువలతో
దోస్తీ చేసినట్టుగా అమ్మ పిలుపుతో
అలుపులన్నీ తీర్చుకుని గప్ చుప్ గా
లేచిపోవడం మినహా అవకాశంలేని
అలవాట్లు ...
ఉద్యమాల దొంతరలతో ఉలిక్కిపడిన
చదువులకు..ఏమరుపాటుతో ఎదురీది
ఎగరేసిన విజయబావుటా...పల్లె తల్లి ఒడిలో
రాజఠీవి వెలగబెట్టి
ఛాతీ విరుచుకున్న సంబరాల ఫోజు ...
శ్రావణమాసపు చిరుజల్లుల్లా
చకచకా
నాలుగేసి కొలువులు
మారిపోయి.. వెలుగుల
కల్పవృక్షం నీడలో దాదాపు నాలుగు దశాబ్దాలు
కమ్మని పరిమళాలు శ్వాసించాను...
నిజంగా… గెలుపు పిలుపు పలకరింపు
ఒళ్ళంతా తుళ్ళింతలై..మనసంతా మరో
లోకంలో విహరింపజేసి…పరిచయమంతగా
లేకున్నా పలకరింపులతో దోస్తానా చేస్తది…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment