కాళోజి గారి వర్ధంతి
తేది : 27-10-2023
శీర్షిక : భాషా యాసల కాపలా కర్ర.
పుట్టుకనే భాషాపండుగ రోజుగా
పుణికిపుచ్చుకున్న పుణ్యమూర్తి ...
బ్రతుకంతా నిత్య బత్తెమెరుగని
భాషా పోరాట యోధుడు ...
అక్షరాల మాంత్రీకుడతడు
లక్షణమైన లక్ష్యముల సాహితీ సేవకుడు…
అచ్చమైన తెలంగాణా గుండె చప్పుళ్ళకు
అనవరతం తెగువ చూపిన కవి పండితుడు....
అణా కథలతో ఆరంభించి
అన్యాయాలను ఎదిరించినా…
హింస.. రాజ్యహింస వద్దని అహింసను
అక్కున చేర్చుకున్న 'గొడవ 'కారి.
మాండళికాల మనుగడను నెత్తికెత్తుకుని
యాస నుడికారాల ఘాటును..మమకారాల
మాటను..మంత్రించి ప్రశ్నించిన ధిక్కారం
తెలుగంటే ప్రాణమెదురుపెట్టే తేనెతుట్టె....
తెలంగాణ వేష భాషలు యాసలు
తెరమరగై కనుమరుగై…కునుకులో
తెల్లారిపోకుండా కాపలా కర్రయి
అల్లాడిన ప్రజాకవి మన కాళన్నా
నగునూరి రాజన్న.
No comments:
Post a Comment