అద్దాల మేడ
27-09-23
శీర్షిక : చేతలకు చేబదులు
మెరిసేదంతా బంగారం కాదన్నట్టు
మేడ బ్రతుకులు మేడిపండు చందమే
మనసుతో నిత్యపోరాటాల సంఘర్షణలే..
చూపులకు సుందరమే అయినా
పొరుగుల కరుణా కటాక్షమే కీలకం….
నోరు మంచిదయితే ఊరు మంచిలా
మన చేతలకు చేబదులులా…
అందులో బ్రతకడం అంత సులభమైన
మాటేమి కాదు... కొన్నింటికి ఓర్చుకుంటేనే..
నోరు అందలమెక్కుదామంటే
నొసలు కట్టెలు మోద్దామన్నట్టు
కష్టార్జితమో కానిపనుల సారాంశమో
కాలచక్రములో కలినిర్ణయాలు ...
ఓడలు బండ్లవుతాయి
బండ్లు ఓడలౌతాయి..
సమకాలీనతల సంతులనమయ్యే
న్యాయ సూత్రాలు నమ్మకుంటే
ధర్మ సూక్ష్మాలను దర్శించుకుంటే
నీతిని గోతిలో పాతిపెడితే ...
అనుభవాల మూటలను
అవపోశన
పట్టుకుంటే
అంతా అవగతమే…
మనసున్న మనిషికి
స్వయంచాలక పరిశీలనలో ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment