భక్తి గేయాలు.
తేది - 23-09-23
శీర్షిక : గ్రామ దేవతలు.
సహస్రాధికం.
వందనమమ్మా దుర్గాదేవి
దండాలమ్మా భవానిమాత…
దుష్ట శిక్షణతో దునుమాడి
శిష్ట రక్షణము గావించెదవు..
అమ్మా శాంభవి వందనము
ఆదరించి మము కాపాడమ్మా…
ఆదిశక్తికి అక్కలు చెల్లెళ్లు
ఆదరించే గ్రామదేవతలు…
అభయములిచ్చే అమ్మలు వారు
మోక్షములిచ్చే వరదేవతలు ...
// వందనమమ్మా//
ఊరూర నడిబొడ్డున
పబ్బతిబట్టి కొలిచేరు
భూరి కొలుపుల పూజించి
భూలక్ష్మమ్మగా పిలిచేరు
మశూచి పీడలు వదిలించి
మంచి చెడుల ఆరోగ్యాలకు
పొలిమేరలలో పలకరించి
పోలేరమ్మగ దీవించు తల్లి…
// వందనమమ్మా//
ఆరోగ్య మూలాలు అందించి
ఊరు వాడ చల్లగ ఉంచమ్మ…
కల్లు శాఖలతో కనికరించుమా
కనిపెట్టుకుని మము కాపాడమ్మా…
తెలంగాణలో పల్లె పల్లెన
ఊరూర పోచమ్మగ వెలిసి
అడుగడుగున మైసమ్మగ నిలిచి
ఆదరించుమా తల్లీ దుర్గమ్మా…
వందనమమ్మా దుర్గాదేవి
దండాలమ్మా భవానిమాత…
నగునూరి రాజన్న.
No comments:
Post a Comment