Wednesday, June 12, 2024

శమీ పత్రం 23-10-23 శీర్షిక : విజయ దశమి.

 శమీ పత్రం  23-10-23

శీర్షిక : విజయ దశమి.  

 చెట్టు పుట్ట గుట్ట వాగు వంక 
 అన్నీ ఆ ప్రకృతమ్మ అంగాలే 
 పూజకు పుణ్యాలే హైన్దవాన 
 సంస్కృతి సంప్రదాయాల జడి... 

 అందునా ఔషధ గుణాల ద్రష్ట 
 పరమపూజ్యులు నడిచిన పథం 
 అర్జునస్య ధనుర్ధారీ రామస్య 
 ప్రియదర్శినీమ్.. ప్రియమే మనకు సైతం...

స్పర్శిస్తేనే సకలం విజయం 
ప్రదక్షిణలతో పాప సంహారం 
అనుభవాల సారమంతా 
ఔపోషణల భాండాగారం … 

యుగమేదైనా సుగమమే జమ్మి 
త్రేతాయుగంలో పరంధామునికి
ద్వాపారంలో పాండవులకు 
విజయాలను మూటకట్టిన వృక్షం… 

విఘ్నాధిపతి పూజలలో ఒకటి 
వింత గుణాల విదుషీమణి 
ఇచ్చిపుచ్చుకునే ఇలవర్షలతో 
ఇతోధిక స్నేహ సుహృద్భావాల 
సుందరీమణి… 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment