Wednesday, June 12, 2024

విజయం దరి చేరాలంటే తేది 22-10-23 శీర్షిక : విజయ హారం …

 విజయం దరి చేరాలంటే 

తేది 22-10-23
శీర్షిక : విజయ హారం … 

తల్లికడుపున నేర్చిన తండ్లాటల 
తర్ఫీదులు.. ఆటవికతలనుండి 
ఆవిష్కరించుకున్న ఆధునికత్వం...
అంతగా నూతనత్వమేమి కాదు … 

 విషయ పరిజ్ఞానాల వివరాలు 
 విడమరిచిన ప్రణాళికలు 
 ఎడతెరిపిలేని పరిశ్రమలు 
 తలకెత్తుకునే సంకల్పాలు 
 పట్టుదలల పెట్టుబడులు… 
వెరసి గొంగళిపురుగు హంగులతో 
రంగుల సీతాకోకచిలుకలా …. 

ఓపికలను శిఖం చేసుకుని 
 ఒడుపులను ఒంపుకుంటే 
 స్వయం క్రమశిక్షణలను సంధించుకుంటే... 
 సాధనల సమకూరవా విజయాల హారం... 

ఆశలు ఆశయాలై వర్దిల్లగా ధర్మచరణాల 
రహదారిలో న్యాయాధీశ మార్గాలలో 
 ప్రగతి పథం నీ దారైతే తధాస్తులు 
తాళమేయంగా పలకరించదా పరిమళించిన విజయం... 

నగునూరి రాజన్న. 

No comments:

Post a Comment