Wednesday, June 12, 2024

పూల జాతర 16-10-2023 శీర్షిక : సప్తవర్ణ శోభితం

 పూల జాతర

16-10-2023
శీర్షిక : సప్తవర్ణ శోభితం 

అసురుల తెగనరికిన దుర్గమ్మ
అమ్మ పేరున జరుపుకునే బతుకమ్మ
రంగుల శింగిడిలో రమ్యమైన పూలు
కుదురుగా కుప్ప పోసి కొలిచే సంస్కృతి … 

బంగారు తంగేళ్ళు బహు సక్కని గునుగులు 
ఘనమైన గుమ్మడి చిట్టి గోరంటలు 
సొగసైన కట్లలు పచ్చన్ని చామంతులు 
తీరొక్క పూలతో తీర్థమే బతుకమ్మ పండుగ… 

అతివల నోటిలో అవతరించిన గానం
అందమైన పొందికలతో తాళయుక్తం… 
వలసవాదుల పాలన సమయంలో 
వజ్రాయుధమై వాడి గలిగిన అంకుశం ..

కష్టసుఖాలను కలబోసి గురు చెప్పని రాగంతో 
 గురుతరమైన తాళంతో అమ్మలక్కలంతా కూడి 
అనువైన రీతిలో వలయాలు వలయాలుగా 
మయూర వయారమై సామూహిక పదజతలు… 

పట్టు పరికిణీలతో చిట్టిచెల్లెల్లు 
అంగరంగ వైభవంగ ఆడవారంతా 
రంగురంగుల వస్త్రాలతో బుట్టబొమ్మలై 
అమ్మవారిలా అలంకరణలతో ఆడిపాడేరు
తొమ్మిది రోజులు..


నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment