Wednesday, June 12, 2024

బతుకమ్మ పండుగ తేదీ 01-10-2022 శీర్షిక : సప్త వర్ణ శోభితం

 బతుకమ్మ  పండుగ 

తేదీ 01-10-2022
శీర్షిక : సప్త వర్ణ శోభితం     
సంఖ్య: 1000

బతుకమ్మ బతుకమ్మ  ఉయ్యాలో 
బంగారు బతుకమ్మ  ఉయ్యాలో 

అతివలంత కూడి ఉయ్యాలో 
అసుర సంహారం గావించిన ఉయ్యాలో 
అమ్మవారిని కొలుతురు ఉయ్యాలో   
అనువైన తీరునా ఉయ్యాలో 

శక్తిపూజ చేస్తురు ఉయ్యాలో     
శరన్నవరాత్రుల్లో ఉయ్యాలో   
బాధలన్నీ తెలిపి ఉయ్యాలో 
బతుకునియ్యిమని కోరి ఉయ్యాలో 

తీరొక్క పూలతో ఉయ్యాలో 
తీర్థమోలే ఒక్కటయ్యి ఉయ్యాలో 
కన్నుల పండుగై ఉయ్యాలో
శోభిల్లె నిండుగా  ఉయ్యాలో 

బంగారు తంగేళ్లు ఉయ్యాలో 
బహు చక్క బంతులు ఉయ్యాలో 
ఇంపైన  గునుగులు ఉయ్యాలో
ఇల మెరయు పట్టుకుచ్చులుయ్యాలో

చిత్రంగ గుమ్మడి ఉయ్యాలో
చిరు ఉద్రాక్షలు ఉయ్యాలో 
చిట్టి గోరంటలు ఉయ్యాలో
మురిపాల చామంతులు ఉయ్యాలో 
పచ్చన్ని బీరలు ఉయ్యాలో 
పావురంగ  కట్లలు ఉయ్యాలో

రంగుల పూలన్నీ ఉయ్యాలో
రమ్యంగా పేర్తురు ఉయ్యాలో 
ఘనమైన  గౌరమ్మను ఉయ్యాలో
అందునా చేర్తురు ఉయ్యాలో
 
పట్టుబట్టలు కట్టి ఉయ్యాలో
పడతులంతా జేరి ఉయ్యాలో
పాటలే కట్టిరి ఉయ్యాలో 
గౌరమ్మ పాటలు ఉయ్యాలో

ఆత్మీయంగ పాడేరు ఉయ్యాలో
ఆమని కోయిలలై ఉయ్యాలో 

తొమ్మిదో రోజున ఉయ్యాలో 
సద్దుల బతుకమ్మగా ఉయ్యాలో 
సల్లంగ చూడమని ఉయ్యాలో 
సత్తు వాయనంతోడ ఉయ్యాలో     
సాగనంపేరు ఉయ్యాలో


నగునూరి రాజన్న 
కరీనగరము (రిచ్మండ్)


వలసవాద పాలన్లో  ఉయ్యాలో 
వజ్రాయుధమాయె ఉయ్యాలో

పిక్కటిల్లే తీరుగా ఉయ్యాలో

No comments:

Post a Comment