Wednesday, June 12, 2024

పొదుపు తేది: 14-10-2023 శీర్షిక: మదుపుకు బాట

 పొదుపు 

తేది: 14-10-2023
శీర్షిక: మదుపుకు బాట 


వందయ్యేదాకా నీవంతు 
వందయ్యాక నావంతు అనే 
రూపాయి కథ మనం తెలుసుకోపోతే
అలుసై పోతాము నలుగురిలో…. 

అందంగా అందరికి తెలిసినా 
పొందికైనది మాత్రం హైందవముననే ... 
అక్కునచేర్చుకుని ఆదరించి ఆచరించి 
అందువల్ల లాభాలు పొందినది .. 

రేపటికంటూ ఓ ప్రత్యేక రూపమిచ్చి 
ఆశలను ఆశయాలుగా మలుచుకుని 
గమనాలకు  గమ్యాలను నిర్దేశించి 
 గమనశీలతలకు అడుగులు నేర్పే ఘనాపాటి ... 

మదుపులను కుదురుగా నేర్పి 
పునః పెట్టుబడులకు బాటలు వేసి.. 
పురోగతిని పుణికి పుచ్చుకునే పరిశ్రమలకు 
పట్టంకట్టి రూపమేర్పరిచేది ... 

పట్టుదలల చిట్టి చీమలలాగా 
పట్టు తేనెల పెట్టు తేనెటీగలలాగ
సమస్యలకు సమాధానంగా
సమూహలుగా జట్లు కట్టుకుని
సమసమాజాలుగా ఎదగడానికి 
సహజమార్గమేర్పరుచు డ్వాక్రా గ్రూపులుగా… 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment