Wednesday, June 12, 2024

భక్తి గీతము తేది : 14-10-2023 శీర్షిక : నారసింహుడా వందనమయ్యా…

 భక్తి గీతము

తేది : 14-10-2023
శీర్షిక :  నారసింహుడా వందనమయ్యా… 

నారసింహుడా వందనమయ్యా 
నామొర వినగా రావేమయ్యా … 

భక్తిపూర్వకమై ప్రణమిల్లిన 
ప్రహల్లాదునికి వందనం ... 
అందుగలడు ఇందులేడనే 
సందేహం వలదనగానే ... 
స్తంభమందున ఉద్భవించిన 
స్వామీ నీకూ….  వందనం ....  
                // నారసింహుడా//
యాతనెంతో ఓర్చుకుని 
యాదాద్రినే చేరినాము ... 
రౌద్రమూర్తి నీకు చేతులెత్తి మొక్కేము… 
ఓ స్వామీ నీ రూప చూడలేక 
భయకంపితులౌతున్నాము.  
         
నారసింహుడా వందనమయ్యా 
నామొర వినగా రావేమయ్యా … 

మాకు నీవు తప్పా 
దిక్కెవరు లేరు స్వామీ 
యాదగిరిశా…….. నీకు 
వేవేల వందనాలు … 
లక్ష్మీ నారసింహుడవై
దర్శనమీయగ రావయ్యా… 
          // నారసింహ// 
యాదాద్రి వాసా నీకు 
జేజేలు పలికినాము … 
మా ప్రభువ నారసింహా 
వరమములేమి కోరలేదు … 
మా తనువంతా నీవేనయ్యా 
మా సర్వము నీవేనయ్యా…. 

లక్ష్మీ నారసింహ వందనమయ్యా 
నామొర వినగా రావేమయ్యా … 

నగునూరి రాజన్న. 

No comments:

Post a Comment