Wednesday, June 12, 2024

పన్ను తేది : 13-10-2023 శీర్షిక : చైతన్యమే శరణం

 పన్ను 

తేది : 13-10-2023
శీర్షిక : చైతన్యమే శరణం

బతుకెంత వ్యక్తిగతమైనా 
బాటంతా సామూహికమేనాయె.. 
బలం కూడగట్టాలంటే 
బాధ్యతలు పంచుకోవడమే ... 

విజ్ఞతలను వస్త్రగాయితం పట్టి 
రక్షణలకు రహదారులకు సామూహిక
వినిమయాలకు కనిపెట్టిన సూత్రం .. 
వింత పోకడలతో వినూతనమై 
విధివంచితులకు ఆసరా కావాలని
ఆరాటము కొంత మంచిదే ... కాని 

అవపోశన పట్టిన ప్రత్యక్ష పరోక్షమైన అనుభవాలను 
అటకెక్కించి సొంత పైత్యాలను రంగరిస్తూ 
అసలు ప్రయోజనాలను ఆమడలకు పంపేసి 
అక్కరకు కుర్చీలకు వ్యక్తుల పూజలాయే...

దేశమంతా ఒకటే అంటూ రాసుకున్న 
రాజ్యాంగం కూడా అపుడపుడు ఆశ్చర్యపోతున్నది 
 బల్లకింద చేతులతో బలోపేతమై పోతున్న 
అధికారగణాలతో  కార్పొరేట్ల ఆధిపత్యంతో ... 

ప్రజలు సంపూర్ణ అక్షరాస్యులైతే 
ప్రశ్నలెక్కువైతాయని గమనించిన 
పాలకులు మత్తు జోలలు పాడుతూ
 ప్రజాగళాన్ని ఎప్పటికప్పుడు చెప్పుచేతల్లో 
పెట్టుకుంటూ ఎంగిలి మెతుకులు 
పంచేస్తున్నారు తెలివిగా ...

కాలానుగుణంగా ప్రజలంతా 
 చైతన్యవంతులై కదిలితే తప్ప 
 కదలికలు రాక.. కనులు విచ్చుకోక 
 కష్టాలనెదుర్కొక తప్పదు మనకు ...

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment