Wednesday, June 12, 2024

అమ్మ అల్లం - ఆలి బెల్లం 12-10-23 శీర్షిక. తల్లివేరు.

 అమ్మ అల్లం - ఆలి బెల్లం 

12-10-23
శీర్షిక. తల్లివేరు.  

అనుభవాలతోటలో నోటిమాటలో  
ఎదుటివారి సూటిపోటి మూటలో
కానీ మానసిక పరిపక్వతల లేమిలో 
తొందరపడి నోరు జారిన పలుకులే... 

అతి సర్వత్ర వర్జయేత్ లా 
బాధ్యతల చట్రంలో బంతాటలా 
పరిమితిలో పలుకులు చేతలుంటే 
పదాలవసరంలేని పనులే … 

బుద్ధినేర్వని రోజులలోనే బువ్వకు
జీవగడియారమై బొజ్జ నింపిన
భూరి మనస్సు…బుద్ది ఎట్ల పుడుతుంది 
పుసుక్కున సూటి మాటకు... 

యవ్వనపు సుఖాల మీద 
 యావలున్నంతమాత్రాన 
 పెంచి పెద్దజేసిన తల్లివేరుకు 
 చీడపురుగైతే మనుగడే ప్రశ్నార్ధకం ..

ఆలి సైతం మన పిల్లలకు తల్లేనన్న 
మూలసూత్రం మరిచామో… 
మార్గదర్శకమే మన నడవడికై
సిగ్గుపడే రోజొకటొస్తుందని గుర్తించాలి… 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment