Wednesday, June 12, 2024

అడుగుల సవ్వడి తేది 11-10-2023 శీర్షిక : మాయమౌతున్న అడుగులు.

 అడుగుల సవ్వడి 

తేది 11-10-2023
శీర్షిక : మాయమౌతున్న అడుగులు. 

నాగరికత నడకలతో హొయలొలికిన 
నవీన ప్రపంచం..నాలుగడుగులు వేసిందో లేదో 
పారిశ్రామిక ప్రగతి రథాలుగా రవాణా 
సాధనాలు నందనమై పలకరించాయి.. 

ఆ తదుపరి వచ్చిన అంతర్జాల మహిమలు 
అన్నీ ఇన్నీ అని చెప్పలేము.. 
దృశ్య శ్రవణ దూరవాణి దూరిపోగనే
కూర్చొని కుదేలయిన విశ్వం... 

సాంకేతికత సౌరభాల తోటలో 
మరులుగొలిపే మగువ మాంచాలిలా
పిడికిట బంధించుకున్న చరవాణి 
కాస్త  తెరలవాణిగా అవతరించిగానే… 

కొరత సామానుల కొనుగోళ్ళకు కూర్చొని 
ఆన్లైన్లో ఆర్డర్లు వేసే ఆరిందవడమే కాకుండా 
పిలుపుల పెద్దరికానికి తలుపులు తీసి 
ఆహ్వానాలు స్వయంగా అందిస్తుంటే...

అడుగుల దూరాలు పెరిగిపోయి
పలకరింపులన్నీ కృత్రిమ పూలవనం
పరిమళాలై ఘ్రాణిస్తుంటే మనుషులంతా
వాస్తవంలో దూరమౌతున్నారు ... 

సహజమైన నడకలకు సవాలక్ష అడ్డంకులు
 ఏర్పడగానే..ఆరోగ్యబండి దోరగిల పడుతుంటే.. 
మాయమౌతున్న అడుగులసవ్వడికి 
మందులక్కరలేని మర్మంగా నడక 
సాగించమంటున్న వైద్యసలహాలు... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment