Wednesday, June 12, 2024

చిత్ర కవిత 09-10-23 శీర్షిక. ఆభరణములు

 చిత్ర కవిత 

09-10-23
శీర్షిక. ఆభరణములు.  

ముంగురుల కేశముల ముద్దు అలంకరణలు
మెప్పైన సవరం కొప్పులోనికి కుప్పె
పాపటన  పచ్చలు పదిలమై నిలువంగ
నుదుటన బొట్టుతో నిగనిగల మెరువంగ 
                         // పార్వతీ //
చెవులకు దుద్దులు చెనుకులీనంగ
తళుకుల ముక్కెర మిలమిలల దర్శింప
రంజింప జేసేటి చంపేశ్వరాలతో 
ధగ ధగల హారములు  జిగినీలు కురియంగ  ....   
                      // పార్వతీ //
ముంజేతి కడియములు మురిపములు తీర్చంగ
చమికీల గాజులు చేతినిండా తొడిగి
భుజమున వంకీలు బహుచక్క నొప్పంగ
భజియించి కీర్తనలు గావింతునమ్మా .... 
                     // పార్వతీ //
ముత్యాల దండలు నిత్యమై నిలువంగ                    
పచ్చల హారములు ఒప్పుగా సొంపంగ
కంఠమున హారములు  మురిపమై మెరువంగ
కమనీయ భక్తితో కొలుతునోయమ్మా .... 
                       // పార్వతీ //
నడుమున ఒడ్డాణం దండిగా ధరియించి
కాళ్లకు కడియములు  కమనీయ భరణాలు 
నవ రత్నములన్నియు సక్కంగ సవరించి
సాదరమ్ముగ నిన్ను పూజింతమమ్మా..

No comments:

Post a Comment