చిత్ర కవిత. (బంగారు ఆభరణాలు)
09-10-23
శీర్షిక : భారతీయ సంస్కృతి.
భారతీయతకు పెట్టి పుట్టింది
భవ్యమైన భవిష్యత్తుకు బలమిస్తూ ...
సంప్రదాయంలో పెద్దపీట వేసుకుని
సంస్కృతిలో హొయలొలుకుతుంది ...
అమ్మవార్లకు అంగాంగ ఆభరణములై
అయ్యవార్లకు కూడా అమిరి పోయి
అరయ మెరుపులీని సొగసులు పెంచి
భక్తులకు భవ్యమైన దర్శనభాగ్యం…
ఆడవారి అందాలను ఇనుమడింపజేస్తూ
ప్రకాశాలను ప్రతిభావంతంగా వెదజల్లుతూ
నకశిఖ పర్యంతరం ఆవహించి
నభూతో నభవిశ్యతి అంటున్నది ...
తలపైన కిరీటమై ఠీవీలొలకబోస్తూ…
పిల్లలైనా సరే పాపటన బిల్లగా..
తిప్పలైనా సరే జడలోన శిఖలోన కుప్పెగా…
గొప్పగా అమిరిపోవు లక్షలకు గోరంతగా…
తెల్ల ముత్యాలతోనో నవ రత్నాలతోనో
ఎంచి జతగూడు మంచి స్వర్ణకారుని చేతిలో
మెడలోన హారాములుగా చేతులకు గాజులుగా
చేరి నిలుచు నడుమున ఒడ్డాణముగానైనా
బిడ్డడి చేతికి మురుకులుగానైనా…
వందేండ్ల చరిత చూసినా వాటముగా
రేటు పెరగడమే గాని…తరగడమెరగని
తపస్విని… పేదల్ని ఎప్పుడు చేరదీయక
అందరం సమానమేనన్న సూత్రానికి
ఆమడల దూరాన ఉంచడమే దానిపని….
నగునూరి రాజన్న
No comments:
Post a Comment