ఓటమి పాఠాలు
తేది : 05-01-2022
శీర్షిక : విజయనానికి ఊతం ...
కవిత సంఖ్య : సహస్రాధికం
అలుపెరుగని అనంతమైన
ప్రయాణంలో అన్నీ అనుభవాల పాఠాలే ...
పడిలేచినప్పుడల్లా పారే రక్తపు
మరకలు ... పలకరించే నొప్పికి
పట్టింపులతో ఆగిపోని బాల్యం
అదే మనకు ఘన ఉదాహారణం ....
ఒక్కొక్క దెబ్బ ... ఒక్కొక్క ఉలి దెబ్భై
చక్కని శిల్పానికి ఆకృతినిస్తుంది ...
ఒక్కొక్క ఓటమి కొత్త పాఠం నేర్పుతూ
సవాళ్లకే సవాలు విసిరే శక్తినిస్తుంది ....
అడుగడుగున ఓ గురూపదేశమై
అతవిశ్వాసాలను అవపోశన పట్టించి
అకుంఠిత దీక్షా దక్షతలను నేర్పి
ఆశల గమ్యాలకు ఆశయాల గమనం
బోధిస్తుంది ....
చీకటి వెలుగుల బాటలలో
వెలుగు రేఖలను ప్రసరింపజేస్తూ
వెన్నెల రాత్రుల చల్లదనాలతో
ఔషధ లేపనాలతో చల్లని దీవెనలిస్తుంది ....
గిర్ గిర్ కర్ చల్నా సీఖో
అన్న గొప్ప కవి పుంగవుని
మాటల్లో దాగిన సత్యములా ....
ఓటమి శాశ్వతం కాదని తెలిపి
గెలుపుకు ఊతమై నిలుస్తుంది ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment