తోడు నీడ
తేది -08-11-2023
శీర్షిక - చూపులు కలిసిన శుభవేళా…
సహస్రాధికం.
చూపులు కలిసిన శుభవేళా
అంటూ
యుగళగీతం ఎత్తుకుని పాడుకున్నా
చిన్నా చితకా చీకటి అడ్డంకులకు..వెలుగుల
బుడ్డిదీపానికి నాలుగు
చేతులడ్డుపెట్టి
ఐక్యతా రాగం శృతి చేసి పాడాము…
పరస్పర మానసాలు ముద్ద మందారాలై
వికసించాయి… పెద్దల చేతులు అండదండలై
ఇష్ట కామ్యార్థ సిద్దిరస్తు అంటూ ముందకొచ్చి
ముచ్చటగా దీవెనలందించాయి….
ఒకరికి ఒకరం నిత్యం తోడై
కాట కలువకుంట కాపెట్టుకుంటూ
కళ్ళల్లో వత్తులేసుకుని కంటికి
రెప్పలా
కన్నోళ్లతో అభివృద్ధిలో అడుగులేయించాము..
అవసరాలో అత్యవసరాలో ఎప్పటికప్పుడు
ఒకరి మనసును మరొకరం
చదువుకుంటూ
పర్సును పదిలంగా పట్టుకునే పాఠాలు
నేర్చుకుని
ఎప్పటికప్పుడు ఖర్చుల కొండను
అరగదీసేవాళ్ళం..
చదువులమ్మ ఒడిలో పిల్లలు ఎదిగి
ఒదిగి చదువుల చిగుళ్లతో కొమ్మలు రెమ్మలై
పూస్తూ వృద్ధి
చెందుతుంటే మనమున సప్త
వర్ణ సింగడీల ఆనందాల పూలు
పూసేవి...
భవిష్యత్తులో భావ సంపదగా
సంస్కృతి సంప్రదాయాల పుటలలో
సమున్నతమైన స్థానంగా పదిలమై
బంధం
ఉదాహరింపబడి బాటలు వేయాలి….
కరినగరము.
No comments:
Post a Comment