Thursday, June 13, 2024

కడిగిన ముత్యం తేది-03-11-2023 శీర్షిక - పుటం పెట్టిన స్వర్ణం.

 కడిగిన ముత్యం 

తేది-03-11-2023
శీర్షిక - పుటం పెట్టిన స్వర్ణం.  


బుద్ది నేర్వని పక్షులన్నీ 
మరకలేని సుద్దముక్కలే …
అవి నేర్పిన అక్షరాలతోనే 
విజ్ఞానాల వీచికయినాక ...

 అజ్ఞానాలు వీడి సుజ్ఞానాలను 
 అక్కున చేర్చుకుని ప్రజ్ఞతో 
 ప్రగతి మెట్లెక్కి ప్రజల క్షేమాలకు 
 చిరునామాగా మారాలి ...

దుర్బిని వేసుకుని చూసినా
అంతా దున్నుకునే వాళ్ళే కాని 
కడిగిన ముత్యం లాంటి 
అబ్దుల్ కలాములే కరువు… 

అపార విజ్ఞానాల ఖని 
 అంతరిక్ష పరిశోధనాలైనా 
 అణు పరీక్షలలోనైనా 
 అటుపిమ్మట రాష్ట్రపతిగానైనా ... 

 పుటం పెట్టిన స్వర్ణంలా 
 పుణ్యమూర్తినే చరిత్ర పేజీలలో 
 చర్విత చరణమయి జాతి కీర్తిని 
ఇనుమడించిన రత్నమాణిక్యం ...

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment