జానపదగేయం
తేది 07-10-2023
శీర్షిక - శరన్నవరాత్రులు.
రావమ్మా దుర్గమ్మ
రారాణిగ అవనికి …
ఆశ్వీజం వస్తున్నది
అమ్మపూజ వేళాయె
శరన్నవరాత్రులలో
శక్తి పూజ కాలంగా…
ఆకారం మార్చుకున్న
అసురున్ని సంహరించ..
అవతరించె దుర్గమ్మగ
ఆదిశక్తి జగజ్జనని …
రావమ్మా దుర్గమ్మ
రారాణిగ అవనికి …
తొమ్మిదొద్దుల యుద్దంతో
పదవరోజు విజయించ…
నవరాత్రి ఉత్సవములు
విజయదశమి సంబరాలు …
మహిషాసుర మర్ధనం
మహిలోన ఆనందం…
వైదికము పురాణము
వివిధమైన మార్గములు…
రావమ్మా దుర్గమ్మ
రారాణిగ అవనికి …
ఆచారం సంప్రదాయం
అన్నియు సమున్నతం...
సంస్కృతీ హైందవాన
సద్భావన సందళ్ళు…
ఊరూరా పూజలంది
ఉద్దరించు జాతిని ....
బతుకమ్మగా తెలంగాణ
బహుగొప్ప కీర్తి నీకు ....
రావమ్మా దుర్గమ్మ
రారాణిగ అవనికి …
No comments:
Post a Comment