Wednesday, June 12, 2024

చిత్ర కవిత. తేది 06-10-23 శీర్షిక : ప్రాణవాయువులు.

 చిత్ర కవిత.

తేది 06-10-23
శీర్షిక : ప్రాణవాయువులు.  

శిశిరంలో తలలు దులుపుకున్నా 
వసంతంలో ఆశలపల్లకి మోస్తూ 
తరువెప్పుడైనా తనువంతా 
సమర్పించు జీవరాశి సంక్షేమాలకు ...

తరువెండినా  త్యాగాల చిరునామానే..
తపనలతో నిలువు నిస్తారం…కవన గీతమై
బోధనలందించు గురువుగా మార్గదర్శియై 
మానవాళి మనుగడలో మహాత్తరమై…. 

పదిలపరిస్తేనే పర్యావరణం 
కుదేలుచేస్తే శ్మశానమే...నాకెందుకన్నావో
ఖర్మ సిద్ధాంతం కాస్తా రాద్దాంతమే…
అవుద్దా అనే అనుమానాలసలొద్దు.. 
అడుగేయి ముందుగా … 

 మనిషి పట్టించుకోపోతే అధోగతే 
 పట్టుబట్టి మనకై సాధించుకోపోతే 
 ప్రకృతి పగబట్టి కసిదీర్చుకుంటుంది ... 
 కబాడీ ఆట ఆడుకుంటుంది ... 

నీటితో మనమంతా ఆటలాడుకుంటే 
నేడది ఓటికుండయ్యింది.. పాటిగా 
 మనమంతా ఏటి నీరు తాగలేక ఖరీదుల 
వ్యాపార దుస్థితయ్యింది ... 

రక్షణగా రెండుచేతులానించి లక్షణంగా 
నీరందించి మొక్కలు పెంచకుంటే... 
విలక్షణమై మనమంతా మున్ముందు 
ప్రాణవాయువుల సిలిండర్లకు షరాబులం కావాలి ...

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment