Wednesday, June 12, 2024

అత్మీయతల ఆనవాళ్లు తేది 06-10-2023 శీర్షిక : అభయహస్తం….

 అత్మీయతల ఆనవాళ్లు 

తేది 06-10-2023
శీర్షిక : అభయహస్తం…. 

పారిశ్రామికత పరుగుల్లో కల్తీల శాల్తీలవల్లనో... 
అలసత్వ పుటలలో.. కాలుష్యపు కైనీడలో ... 
సాంకేతికత సాలె గూళ్లల్లో స్వార్థాల నీలి నీడలో… 
ఆత్మీయతల చిరునామా గల్లంతై పోయింది… 

ఫలించని పాలనల ఫలితాలో… 
అత్యాశల డబ్బుజబ్బుల మక్కువలో…
ఉపాధిపేరిట పరాయి దేశాల ఉరుకులతో…
దూరాభారాలు పెరిగి కనుమరుగవుతున్న బంధాలు ..

మాటిమాటికి రాలేక …మాయా దృష్య 
శ్రవణంలో మతలబులు తెలుసుకుంటున్న
మధ్యతరగతుల మిద్దెబతుకులు
మినుకుమినుకులై నలిగిపోతుంటే… 

స్వార్థపు మూటల లెక్కల సవరింపులలో
ఉచితాలను ఎరగా వేస్తూ 
స్వదేశంలో ప్రజలను ఓటర్లుగానే చూస్తూ.. 
మత్తు కడు ముంతలలో ముంచుతూ 
కుటుంబ మమతల తీగలను తెంపేస్తూ…
మరయంత్రాలుగా మారుస్తున్న తరుణంలో…
ఎక్కడని వెదికేది ఆత్మీయతల ఆనవాళ్ళు… 

ఆత్మీయత సంద్రములో మునగాలంటే
ధరవరలులేని ఇచ్చిపుచ్చుకోవడాలే… 
అనురాగాంబుధిలో మునిగి ఓలలాడి
ఆదమరిచినా అభయహస్తమై నిలుస్తుంది... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment