Sunday, June 2, 2024

అలలు అలలుగా తేది 05-10-2023 శీర్షిక : మధుర జ్ఞాపకాలు.

 అలలు అలలుగా

తేది 05-10-2023
శీర్షిక : మధుర జ్ఞాపకాలు. 

జీవనయానంలో బ్రతుకుజీవుడా 
అనుకుంటూ రోజులెల్లబోసిన మాకు 
పదవీ విరమణ అయ్యామో లేదో 
ఆలోచలన్నీ విహంగములయ్యాయి ... 

అందరి అదృష్టం బాగుండి 
అందుబాటయ్యాడొక మిత్రుడు 
విద్యాశాఖలో విఖ్యాతమొంది 
వివిధరీతుల అందరిని కలిపే
సంబంధకీలకమై... 

ఎస్సెస్సీ డెబ్బదిరొండు బ్యాచ్ 
ఏబదేండ్ల కలయికకు 
అంకురార్పణ జరగగానే 
మానసమంత గిలిగింతలయింది ... 

ఎక్కడెక్కడ వారమో కలుసుకోగానే
పాయలుగా విడిపోయిన నదీమతల్లిలా 
అలలు అలలుగా పొంగిన మా ప్రేమను 
పావురంగ పంచుకున్నాము …. 

కుశలప్రశ్నల కోలాహలంతో ఆరోగ్యాల 
పలకరింపులతో వారసత్వాల స్థిరత్వాలతో 
 తాతయ్యల అమ్మమ్మల నానమ్మల 
 పదోన్నతుల పరామర్శలతో రోజెంత 
చిన్నగైపోయిందోనని తీరని బెంగలతో 
తీర్థం నుండి బయటికెళ్తున్నంత బాధ పడ్డాం ... 

మళ్ళీ మళ్ళీ మనమంతా నియమిత 
కాలానుగుణంగా కలుసుకోవాలనే 
ఆకాంక్షల వెల్లువలతో ఆనందవర్షాలు 
కురిశాయి కళ్ళల్లో మెరుపులతో …. పాదాలు 
కదిలాయి భారంగా కదలేక నిజంగా… 

No comments:

Post a Comment