అహాల కంచెలు
తేది : 04-10-2023
శీర్షిక :
మిడిమిడిజ్ఞానాల మిన్నకుండక
మిడిసిపడుతూ అధి శిఖరం
ఒడిసిపట్టుకోవాలని ఆశల దోసెలతో
నకనకలాడే ఆకలిని చల్లార్చుకుంటాడు...
తాను పట్టిన కుందేటికి మూడే
కాళ్ళంటూ... నోరు నెత్తిన పెట్టుకుని
ఊరేగడమే కాదు..పట్టుబట్టి
పద్దులు
కూడా తన ఖాతాలో రాసుకుంటాడు ...
తెరచాటు వ్యవహారాలు తేటతెల్లమయినా..
చాటుమాటు వ్యక్తిగత వకాలతులతో
ఎదుటివారి
ప్రాణాలకు ఎసరు
పెడతారు... దేశాన్ని సైతం
ఫణంగా
చేసి అందినంత చేతివాటం ప్రదర్శిస్తారు ...
ఒకే ఒక్కరి అహాల కంచెలతో
దాటలేని బురద గుంటల ఊబిలై
కుటుంబాలెన్నో కుంటుపడతాయి
సమూహాలెన్నో చతికిలడతాయి
దేశాలు సాంతాగా దద్దరిల్లుతాయి ...
జీవరాశులన్నీ కొంతోగొప్పో స్వార్థమయమే
అందులో మనిషి పాలు ఇంకొంచం ఎక్కువే...
స్వార్థం పరాకాష్టకు చేరితే పొడచూపేదే
అహం బ్రహ్మాస్మి...అంత నేనే నామాటే
చెల్లాలి...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment