Sunday, June 2, 2024

జంతువులు మంచి లక్షణాలు తేది : 04-10-2023 శీర్షిక : అన్నీ లబ్ది కారకములే…

 జంతువులు మంచి లక్షణాలు

తేది : 04-10-2023
శీర్షిక : అన్నీ లబ్ది కారకములే… 

చరాచర ప్రపంచములో గొలుసుకట్టులా 
ఒకదానికొకటి జంతువులు శత్రువులైనా.. 
చివరాకరకు అన్నీ లబ్ది కారకములే 
మానవాళికి నిత్య జీవన మనుగడలో ... 

పురుగు పుట్రా పాము లాంటి విష 
కీటకాల నుండి వింతగా కాపాడుతూ 
మానవాళి నమ్మకానికే అమ్మలా 
ఆచరణలతో రుజువుపరిచే శునకరాజు ...

ఇంద్రధనసులోన ఇడమర్చినన్ని 
రంగులతో ఇలలో తల్లిగా పేరొందడమే 
కాకుండా ఎవుసంలో మూలమై 
 మనవాళికే వరాల కానుకైన మూట 
 మాతల్లి మహాత్యం కలిగిన గోమాత... 

దూరాభారాలను జయించడానికి
ధూమశకటంలా పరుగెత్తిన అచ్చమైన 
అశ్వమును కూడా మచ్చిక చేసుకుని … 
వాయువేగాలతో వార్తలను చేరవేసుకున్నాడు… 

నక్కి నక్కి నాటకాలతో
పటిష్టంగా ఎదుర్కొనే పావనమైన
పంట నష్టాలకు మూషికాలను 
 మట్టుబెట్టే పెంపుడు పిల్లి 
అయినా సరే పెన్నిదే మానవాళికి … 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment