Sunday, June 2, 2024

కాలేజీ బస్సు తేది. 04-10-2023 శీర్షిక : పుష్పకవిమానము…

 కాలేజీ బస్సు 

తేది. 04-10-2023 
శీర్షిక : పుష్పకవిమానము… 


 తరాలను మోస్తూ సాగిపోయే 
 మనసులేని మరయంత్రం ... 
 అయినా ప్రతినిత్యం మనసున్న 
 మనుషులతో సహవాసం ... 

 గురువులకు గౌరవసూచికం 
 ముందుపక్క సీట్ల కేటాయింపు 
 ఆతదుపరి కుసుమ మనోహరులైన 
 ఆడపిల్లల సీట్లు ... చివరాఖరుకు 
 చింపిరిజుట్ల జట్లు మగపిల్లలవి ... 

సినిమా హీరోల ఫోజులు 
అమ్మాయిల పలకరింపులకు 
 అర్రులు చాపే ఆకతాయిలు 
 ప్రేమ విత్తులు వేసుకునే చోటు ...

మనసైన స్నేహితులతో 
మనసులు విప్పుకుని మాట్లాడుకునే... 
మామంచి నెలవైన మామిడితోట … 
కాకరకాయ కబుర్లతో  కాలక్షేపము…. 

అన్నిరకాల ఆకారాలకు 
 గుణగణాలకు నెలవైన 
 కుర్రకుంకల కబోదులు 
 కదలాడే కళాశాల వాహనం 

భవిష్యత్తుకు బంగారుబాట 
చూపే పుష్పకవిమానము… 
 
నగునూరి రాజన్న 

No comments:

Post a Comment