Sunday, June 2, 2024

అడవి నుండి అంతరిక్షందాకా తేది : 03-10-2023 శీర్షిక : భూమి గుండ్రం.

 అడవి నుండి అంతరిక్షందాకా

తేది : 03-10-2023
శీర్షిక : భూమి గుండ్రం.  

రాతిగుహనే రాజమహలుగా చేసుకున్నా…
రాజమహళ్ళను రాళ్ళతో నింపుకుంటున్నాడు.
కందమూలాలతో కాలం వెళ్లదీసినా…
ఆరోగ్యాలకు మూలమంటున్నాడు. 
ఆకులలములు చుట్టుకున్నా…
పట్టుబట్టల్లో బుట్టబొమ్మయ్యాడు…

అవసరమే అన్నీ నేర్పించినట్టు 
రాతి పనిముట్లతో రాటుదేలినా..
చక్రం కొడవలితో చకితుడై
మృగాలను వేటాడుతూనే…తన 
ఉనికిని తగినట్టుగా మలుచుకున్నా
అప్పుడప్పుడు ఆ ఛాయలనే ప్రదర్శిస్తున్నాడు ...

ఆకాశమే పందిరిగా చేసుకుని 
 భూదేవమ్మ ఒడిలో నిద్దురించినా 
 చుక్కలతో లెక్కించి కాలగణనలలో 
 కాకలు తీరిన ఖగోళ పండితుడయ్యాడు ...

అడుగడుగున అవపోషణలతో 
అడుగులు వేసి నాగరికతలో 
పరుగు లంఘించి పారిశ్రామికతతో 
విశ్వవ్యాప్తమాయె సాంకేతికతతో ... 

పాలపుంతల అనుపానులను పసిగట్టి 
 గ్రహగతులను జతులు చేసుకుని 
 రాకెట్లను పంపి రహస్యాలను ఛేదిస్తూ 
 గ్రహాంతరాల రాకపోకలకు గమన 
 శీలతలకు పెద్దపీట వేస్తున్నాడు...

ప్రతి యుగంలో పరీక్షలు నెగ్గినా… 
ప్రళయంతో మతులు తప్పి గతులు మారి 
ఓంకారంతో మొదలవుతూ
భూమిగుండ్రమున్నదని నిరూపిస్తున్నారు.  

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment