మమతల వల
తేది : 09-11-2023
శీర్షిక : కాసులు లేని రోజున కడుపుకు
అన్నమయింది
వేదాల ఘోషయో..పురాణాల
పుణ్యమో..
ఇతిహాసాల గతులో..
కావ్యాల కలయికలో ..
అడుగడుగున
కొలువైన ముక్కోటి దేవతల దీవెనలో ...
వీణా తంత్రుల వింతల కోవెల మన దేశం…
భారతీయం అంటేనే భవబంధాల
ప్రేమలకు బలమైన నిర్వచనం...
ఆత్మీయతలు అల్లుకుని మల్లె
సౌరభాలను పంచుతుంది ...
అవిభాజ్య కుటుంబాలలో ఆనవాళ్ళే
ఆప్యాయతా మధురిమలను వంపుకుని
అనురాగ సుధలను జుర్రుకుని
ఆనందించిన దాఖలాలే చరిత్రనిండా…
ఆధునికతల అంటురోగమో
పాశ్చాత్యాల పాపపు కన్నో
మేమిద్దరం మాకిద్దరు వేరేది వద్దు
అంటూ సొంటు లేని జీవితాలకు
దాసోహమంటున్న లోకం ...
కాసులు లేని రోజున కడుపుకు
అన్నమయింది…కడుపులు నిండి
కాసులెక్కువయ్యాక…ఆత్మీయతలన్నీ
ఆర్థిక బంధాలైపోయి లెక్క పెట్టుకుంటున్నాయి.
No comments:
Post a Comment