చిత్ర గజల్
తిస్రగతి 6 6 6 6
12-04-23
ఎదసడిలో కృష్ణయ్యగ
తలచినాను ప్రియమారగ
మదినిండా నింపి నిన్ను
మురిసినాను ప్రియమారగ
మనసంతా నీవుండగ
కలలెన్నో కంటున్నా
ప్రతిక్షణం తలపులతో
నింపినాను ప్రియమారగ
నిత్యమైన నీ యోచన
నీడలాగ వెంటాడే
ఆలోచనల జావళీలు
మోసినాను ప్రియమారగ
నెలవంకల శంకరుడూ
నెమళీకల కృష్ణుడిలా
ఛాయలాగ శిఖలోనా
తురిమినాను ప్రియమారగ
రసరమ్యపు రాజసమే
రవళించగ నీనామం
గంధర్వపు గానములై
పాడినాను ప్రియమారగ…
12-04-2023
నగునూరి రాజన్న.
No comments:
Post a Comment