సంగీతం.
తేది: 22-06-23
శీర్షిక:
ప్రకృతి నిండా పల్లవించునదే
ఉదయాత్పూర్వపు కువకువలు
సెలయేట జాలువారే నీటి గళగలలు
తాళం తప్పని వాయు వీవెనలు….
సరిగామపదనిసల సయ్యాట
శ్రుతిలయల మీటిన సుందరమే..
శిశువులనైనా పశువులనైనా
కట్టిపడేసే మంత్రదండము ....
విషజంతువులనైనా వింతగా
నాట్యమాడజేయు... మాట వినిపించి
మచ్చిక గావించి మనసు మాట
తెలిసి మసలుకొనేలా చేయు ...
రాళ్ళనైనా రంగరించి రాగాలు
పలికించగల నేర్పరి. ప్రకృతిలోనే
ఫరిడవిల్లిన పదనిసలు… రోగాలను
సైతం నయం చేయగల వైద్యులు…
అరువదినాలుగు కళలలో
అలరారిన అమోఘమయిన
ఆయుధం. సాహిత్యంతో మేళవించి
సవాలక్ష కలలకు ఆయువుపట్టై
అన్నింటికీ ప్రాణం పోసింది ...
మానసికోల్లాసాలకు మయూరమవును.
పనిపాటలకు ఉత్సాహాల ఊతము…
ప్రాణములను నిల బెట్టుటలో సంజీవని…
ఉద్యమాలకు చిచ్చరపిడుగై ఊరేగును ….
ఎందరో మహానుభావులు
ఏలికలై నిలిచారు చరితలో
యద్భావం తద్భవతిలా
ప్రయత్నాలతో ఫలితమిచ్చింది ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment