ఎవరిని నమ్మాలి…
తేది 30-08-2023
శీర్షిక - ఆశావాదమే ఆలంబనము.
రామ రాజ్యం ప్రజారంజకమై
ప్రజ్వరిల్లినదన్నా...
గుప్తులకాలం
స్వర్ణయుగమై రంజిల్లినదన్నా...
ఊసుపోని కాకమ్మ కబుర్లు కానే కావు ...
వాస్తవ స్థితిగతుల వర్ణణలే… చరిత్రలే…
భావితరాలకు అవెప్పడు మార్గదర్శకాలే…
యథా రాజా తథా ప్రజా లాగా ..
మాయామశ్చీంద్రపు మానిఫెస్టోలతో
మరిపించి మురిపించవచ్చనుకునే
మతి లేని కొంతమంది నాయకులతో..
గమ్యం నిర్దేశించుకోని గమనమే అవుతుంది…
రాజ్యాంగం మరచిన సవాలక్షలను
సాకుగా చూపిస్తూ…ఐదేండ్లు పాలించమన్న
అధికారాలకు…ముప్పదేండ్ల అప్పులు తెచ్చి
మూటలు సర్దుకుంటుంటే…విషన్నమే….
రౌతు మెత్తనయితే గుర్రం మూడు
కాళ్ళ పైన పరుగెత్తినట్టు…
రాజు మెత్తనయితే రౌడీయిజం రాజ్యమేలినట్టు…ఓ పక్కన పల్లెవాసులంతా అమ్మతనాల
అనుబంధాలతో ఆత్మీయతలతో
కల్తీలకు
కాలుష్యాలకు ఆమడలైతే...
పట్నవాసులంతా
కట్నాలు ఆశించే కొంతమంది కొత్త అల్లుల్లలా... ఎవరెక్కడపోయినా సరే...
ఈ పూట బతికేయాలనుకునేరకం…
అమ్మపాలు కరువైతే ఆవుపాలంటారు…
అక్కడనుండే మొదలయి… అది ఇది యను
తేడాలేకుండా పండ్లు కూరగాయలతో పాటు
అనేక తినుబండారాలలో … మందుల్లో…అనంత
బాహువులతో విశ్వమంతటా వ్యాపించింది..
కలి ముద్రలో… కాల నీడలో… కాని…
ఎదుటివారిని నమ్మలేక… నమ్మకుండా
ఉండలేక… నరక యాతనలతో సతమతమే…
అయినా ఆశావాదంతోనే అడుగులేస్తా నిత్యం…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment