రహస్యం.
తేది 20-09-23
శీర్షిక : సుఖాంతమే…
పాలల్లో నెయ్యి రహస్యములా
సృష్టిలోని సుందరమంతా రహస్యమే…
సంకల్పాల బుట్ట తలకెత్తుకుని
పట్టుబట్టి పద్ధతులన్నీ ఔపోశనైతే తప్ప…
జీవితము నిండా రహస్యాలే
పురిటిలో వాయువు పుణికిపుచ్చుకున్నా
బురిడీకొట్టి తుస్సుమనిపించినా
గాలిబుడగ జీవితమనే నానుడితో ...
విషయమేదైనా ఒక్కరి అధీనమైతేనే...
వివరం కాస్తా విను వీధికెక్కిందా గోవిందా.
అనుకున్న సంకల్పం కాస్త అటకెక్కి
నిరీక్షణల వాకిట్లో నిలువు కల్లేసుకోవడమే …
వ్యక్తిగతం కొన్నయితే సమిష్టి మరికొన్ని
దేశ హితంతో ముడిపడి భావి క్షేమాలకు..
మనసు కలిసి ఆత్మ నిలిపి మసిలితే
కట్టుదిట్టమే రక్షణ విషయాలు
ఎంతైనా….
ఏది ఏమైనా…పరిమితుల మెతుకులతో
పరితపనల ఆకలిని తీర్చే పద్దతులే…
ఏది ఎంతవరకో… ఎవరెవరి మధ్యన
నిర్వచనాలతో…అంతా సుఖాంతమే…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment