జన జాగృతికై
తేది 03-08-23
శీర్షిక : ఎవరికి పట్టని వాగు తుంగలా
పెరిగితే లాభమేంటి?
వజ్రోత్సవాల వాకిట నిలిచినా
అక్షరాస్యతల కుంచం నిండదు…
అసమతుల్యతల త్రాసు మొగ్గదు..
అనారోగ్యాల ఆసుపత్రులు మూయరు ...
ఇంకేమైనా ఉన్నదా …
మన ఆటలు సజావుగా సాగవుగా
మన పాటలు ప్రజారంజకం కావుగా
స్వార్ధపు పడగల నీడలలో సేదదీరాల్సిందే…
ఉచితాలంటూ ఊరించాల్సిందే
అరచేతిలో బెల్లం మోచేతితో నాకించాల్సిందే
మత్తుమందుల క్రీనీడల్లో తచ్చాడాల్సిందే
చిత్తు కాగితాలకు అమ్ముడు పోవాల్సిందే...
గొర్రె తోక జానాబెత్తెడు..
అర్రులు చాచినంత మాత్రాన
అమాంతంగా పెరిగితే ఎలా
మూఢనమ్మకాల మూటల్లో కట్టిపడేయమా ?
తొలకరిలో మురిసిన అంకురంలా
మరిచి పెరిగిన వటవృక్షాలై…
రెక్కలార్చుకుని ఒదిగిపోతూ
బక్క పలుచని డొక్కలకు దిక్కై పోవాలి ...
లేదంటే… ఎక్కడని వెదికేది చిరునామా
ఎవరికి పట్టని వాగు తుంగలా ఎదిగితే
లాభమేమిటి…పాలకుకెలాగు పట్టింపులు
తీరికలు లేవు పట్టుకుని సాధించడానికి….
నగునూరి రాజన్న
No comments:
Post a Comment