Thursday, May 30, 2024

స్నేహ బంధం తేది : 31-07-23 శీర్షిక : మననమే మనసు పులకరింత…

 స్నేహ బంధం 

తేది : 31-07-23
శీర్షిక : మననమే మనసు పులకరింత… 

అమ్మలాంటి ఆత్మీయం 
నాన్న లాంటి లాలిత్యం 
అలుగులై పారే వయసుకు 
పొదివి పట్టుకునే కాలువ తీరాలు... 

వయసు తారతమ్యత ఎంచనిది 
వర్ణ లింగ బేధము చూపనిది 
ఆర్థికాంశాల చిక్కుముడిలో 
చిక్కుకోనిది... కలతలకు తావులేని 
లలిత మధురం... 

మన ఆశయ గమ్యాలకు 
తన గమనము జోడిస్తూ … 
ప్రతిఫలాపేక్షలు లేకుండా 
ప్రయత్నమంతా ధారబోసేది... 

ప్రత్యక్షంగానే కాదు పరొక్షంలో కూడా 
పల్లెత్తుమాట తూలనిది... 
పరాయిలెవరైనా కక్షగడితే 
పక్షపాతం లేకుండా అడ్డగించేది ...

మననంతోనే మనసు పులకరించేది 
మనసులో మెరిస్తే దరహాసం ప్రకాశించేది 
కలలో కలవరింతలో మనసు కోరేది 
కష్టకాలం కడదాకా వెన్నంటి నిలిచేది ... 

No comments:

Post a Comment