Sunday, May 26, 2024

వైద్యుల దినోత్సవం తేది: 01-07-2023 శీర్షిక : చాలా మంది దేవుళ్ళు ....

 వైద్యుల దినోత్సవం 

తేది: 01-07-2023
శీర్షిక : చాలా మంది దేవుళ్ళు .... 

వైద్యో నారాయణ హరి
ఒకప్పటి పూజనీయము… 
మనసులో ఎంతున్నా 
పైకి చెప్పలేని బాధలే ఇప్పుడు  .... 
వైద్యుల పేరు వింటేనే
ఆమడ దూరం పరుగులు
ఈనాడు…

చాలా మంది వైద్యులు 
మానవతకు ప్రతీకలై 
ఆత్మీయతకు మారుపేరై 
మనిషితనానికి ఇంకా పచ్చని 
చిగుర్లు వేస్తున్నారు .... దేవుళ్ళై .... 
 
కష్టంతో వచ్చిన రోగులను 
పరామర్శలతోనే సగం నయం
చేసి ... అవసరం మేరకే 
ఔషధాల చిట్టి జారీ చేయు... 

మందులెంత ముఖ్యమో 
మాట పలకరింపులు అంతే .... 
అనారోగ్యాలకు ఔషధాలెంతో
చిరుదరహాసాలు అంతే….

పేరు గొప్ప ఊరు దిబ్బలా కొందరు 
పేపరుమీద పెద్ద పెద్ద అర్హతలు 
ఎన్నున్నా ఏమిలాభం ...ఈనాడు..
మాట మంతి లేకుండా యంత్రంలా 
నియంతలా ... నడవడికలుండి... 
అనుమానమేదైనా రెండోసారి 
అడిగితే .... సహాయకులతో సమాధానాలు .... 
ఇంకాస్తయితే .... డాక్టర్ని నేనా ... 
నువ్వా ? అంటూ ప్రశ్నల వర్షం ...  

ప్రతి చిన్న దానికి పజీతలా పరపరా 
పరీక్షలు రాసుకుంటా పరేశాను 
ముల్లె  కడితే పతారేముంటది 
ఏరుబడ్డ ఎలుకమీద ఏదుం వడ్లగంప
బరువులా.. నడుమిరిగి నట్టేట మునగడమే.. 

కరోనా కాలంలోనైనా ఇప్పుడైనా 
చాలా మంది ప్రాణాలకు తెగించి.. 
నీకొరకు నాకొరకు నిప్పుల కొలిమెక్కినారు
వాళ్ళు నిజమైన దేవుండ్లు నమ్ము సోదరా!

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment