మట్టి బాట -2
తేది :22-08-2023
శీర్షిక : మట్టి బాటే ఆధారం ....
బుడి బుడి అడుగుల
బుజ్జాయి నుండి... తడబడు
అడుగుల తాతయ్య వరకు
నడకలన్నీ మట్టి బాటలోనే ....
చెప్పులెరుగని కాలాన
మెత్తని పరుపులాంటి
గడ్డిపైన నడకైనా.... రాళ్లు
రప్పల్లో ఒత్తుకున్న గాయాలైనా
తుప్పల్లో గుచ్చుకున్న ముళ్ళైనా
జీవనగమనంలో అనుభవాలే ...
నాడు పల్లెపట్టున తప్పని మట్టిబాట
చిన్న చిన్న దూరాలకు
పిల్ల తోవల నడకలకైనా ....
బహుదూరపు బాటసారిగా
యాత్ర ఉత్సవం వేడుకలకైనా
బండ్ల బాటలలో పైపట్టాలన్నా....
పట్నాలలో పలు విధానాలైనా
పట్టాలాంటి సిమెంట రోడ్డయినా
గండుతుమ్మెద బోలు తారు రోడ్డయినా
కింద ఆధారం మట్టి మాత్రమే ....
నాగరికత నడకలలో రంగు
రూపులెన్ని మార్చినా ఆధారం
మట్టి బాట లేకుండా మనలేము
మట్టి బాట కాదని బ్రతుకలేము
నగునూరి రాజన్న
No comments:
Post a Comment